YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈ నెల 20న జనగామలో సీఎం కేసిఆర్ పర్యటన

ఈ నెల 20న జనగామలో సీఎం కేసిఆర్ పర్యటన

హైదరాబాద్, డిసెంబర్ 16
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రగతి పనులను  వేగవంతం చేయడానికి   ముఖ్యమంత్రి  కేసిఆర్  జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 20వ తేదీన జనగామ జిల్లాలో పర్యటించి సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు డు హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలోని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  క్వార్టర్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ  పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ  బొడేకుంటి వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణ రెడ్డి,  ఇతర నాయకులు సంపత్, రాజేశ్వర్ రెడ్డి, సమావేశమయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  కేసిఆర్  పర్యటన సందర్భంగా చేపట్టే సంక్షేమ, అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అన్ని పనులు సమన్వయంతో చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పనులు వాటి కార్యాచరణ, ప్రస్తుతం సిఎం  దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సిద్ధం చేయాలన్నారు.  శుక్రవారం ముఖ్యమంత్రి సభకోసం మండలాల వారీగా ఇంచార్జీలకు బాధ్యత అప్పగించారు. సభా స్థలాన్ని మండలాల ఇంఛార్జిలతో కలిసి పరిశీలిస్తారు.

Related Posts