YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వృద్దుడి హత్యకేసులో మనవడు ఆరెస్టు

వృద్దుడి హత్యకేసులో మనవడు ఆరెస్టు

నుజివీడు
కృష్ణా జిల్లా నూజివీడు కోటవారిపేట లోని 7 మెట్ల బావి వద్ద వృద్ధుడు అనుమానాస్పద మృతి చెందిన జువ్వనపూడి  ఆదాం(70)కేసును 48 గంటల్లో పోలీసులు  చేదించారు. ఈ నెల 11వ తేదీన రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో నిద్రపోతున్న వృద్ధుడిని చంపి 10 కాసుల బంగారం డబ్బు దొంగిలించినట్లు మృతుడి చిన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నూజివీడు ఇంచార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. కేసు నమోదు అనంతరం సర్కిల్లోని ఎస్ఐలు,  సిసిఎస్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది సహకారంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి చాకచక్యంగా కేసును ఛేదించారు. ఈ హత్య కేసులో ఇద్దరు నేరస్థులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 70 వేల రూపాయల నగదు, నాలుగు బంగారు ఉంగరాలు, ఒక బంగారు చైన్, ఆస్తికి సంబంధించిన వీలునామాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు సర్కిల్ ఆఫీస్ లో పత్రికా సమావేశంలో నిందితుల వివరాలను వారు పట్టుబడిన తీరు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను వాటి యొక్క వివరాలు గురించి  డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.మృతుని మనవడు జువ్వనపూడి వెంకట వరప్రసాద్ తన స్నేహితుడు వనకూరి.ప్రేమ్ కుమార్ తో కలిసి హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది అని వీరిద్దరూ కూడా ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు క్లాస్మేట్ లని మంచి స్నేహితులను అస్తి తగాదాల  నేపద్యంలో హత్య చేసినట్లు ముద్దాయిలు అంగీకరించారని తెలిపారు.మృతుని మనవడు నూజివీడు పట్టణంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పని చేస్తున్నట్లు అతని స్నేహితుడు తాపీ మేస్త్రి అని అతని తన తాతను చంపి బంగారం డబ్బు ఎతుకెల్లినట్లు మొత్తం రికవరీ చేయడం జరిగిందని ఈ కేసులో కీలక పాత్ర పోషించి 48గంటల్లో కేసును ఛేదించడం పై ఎస్ఐలను సిబ్బందిని జిల్లా  ఎస్పి ప్రత్యేకంగా అభినందించారని అదేవిధంగా కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన వారికి రివార్డులు కూడా అందజేస్తున్నామని డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు.

Related Posts