తిరుపతి
భారతీయుల వారసత్వ సంపద అయిన వేదాల సారమే తిరుప్పావై అని, భగవంతునికి, భక్తునికి మధ్య గల సంబంధాన్ని తెలిపే ఈ పాశురాలను ద్రవిడ వేదంగా పిలుస్తారని శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీవారి వైభవాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి ఒకరని, వీరు కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మొదటగా గోవిందా అని పిలిచారని తెలుస్తోందని అన్నారు. గోదాదేవి అనన్యమైన భక్తిభావనతో భగవంతుని కీర్తిస్తూ పాశురాలు రచించారని, పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులందరూ విని తరించాలని కోరారు. భగవంతుని ఆరాధనకు భాషతో పనిలేదని, భావన ముఖ్యమని చెప్పారు.
ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి మాట్లాడుతూ ధనుర్మాసంలో 30 రోజుల పాటు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 208 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి మాట్లాడుతూ విష్ణుచిత్తుని కుమార్తె అయిన గోదాదేవి అపరిమితమైన భక్తితో, ప్రేమతో రంగనాథస్వామివారిలో ఐక్యమైందన్నారు. భక్తులు కూడా ఇలాంటి భక్తిభావనతో భగవంతుని ఆరాధించాలన్నారు.
ప్రవచనకర్త చక్రవర్తి రంగనాథన్ స్వామి మాట్లాడుతూ సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడాన్నే ధనుర్మాసం అంటారని, ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పారు. గోదాదేవి అమ్మవారు పూమాలలతోపాటు పాశురాల మాలను శ్రీ రంగనాథస్వామికి సమర్పించారని వివరించారు.
కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ చక్రవర్తి రంగనాథన్ స్వామి తిరుప్పావై ప్రవచనాల పారాయణం చేస్తారు. ద్వారం లక్ష్మీ పాశురాలను వినిపిస్తారు.
ఒక సామాన్య కుటుంబంలో లో పుట్టి ఉన్నతమైన విద్యనభ్యసించిన షణ్ము ఖ్ యూట్యూబ్ స్టార్ గా పేరు పొందా డని ఆయన తండ్రి కె ఎస్ ఎస్ అప్పా రావు అన్నారు. యూట్యూబ్ లో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా సూర్య అనే వెబ్ సిరీస్ తో ఆంధ్ర తెలంగాణ యువత మనసులు దోచుకున్న షణ్ముఖ్,మా టీవీ బిగ్ బాస్ లో ఫైనల్స్ జాబితాలో నిలవడం అభినందనీయమన్నారు. విశాఖలో మాట్లాడుతూ ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్స్ లో ఐదుగురు ప్రధానంగా పోటీ పడుతున్నారని, అందులో షణ్ము ఖ్ కు విజేత అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టగా,అందులో టాప్ ఫైవ్ లో షణ్ముఖ నిలవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.అందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా షణ్ముఖ్ విజేతగా నిలవాలంటే అభిమానులు భారీ స్థాయిలో ఓటింగ్ చేయాలని హాట్ స్టార్ ద్వారా మరియు మీ మొబైల్స్ ద్వారా మిస్సేడ్ కాల్ ఇవ్వడం ద్వారా ఓటు వేసి షణ్ముఖి విన్నర్ గా నిలిచేందుకు సహకరించాల ని పేరుపేరునా కోరారు.విశాఖకు చెందిన షణ్ముఖ్ అంచెలంచెలుగా ఎదిగి పలు వెబ్ సిరీస్ ద్వారా యూ ట్యూబ్ ప్రేక్షకుల మన్ననలు పొందా రని, ఈ బిగ్ బాస్ కాంటెస్ట్ లో షణ్ముఖ్ టాప్ ఫైవ్ నుంచి టాప్ వన్ గా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రార్థించారు. శుక్రవారం సాయంత్రం లోపు తమ అమూల్య మైన ఓటును షణ్ముఖ్ కు వేసి గెలిపిం చాలని ఆయన తండ్రి అప్పారావు మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కోరారు.