రాజానగరం
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం బీ టెక్ విద్యార్థిని(19) అదృశ్యం అయింది. బుధవారం ఇంటి నుంచి కళాశాలకు బస్సులో బయలుదేరి వెళ్లిన యువతి, కాలేజ్ కు వెళ్లకుండా మధ్యలోనే బస్సు దిగిపోయింది. తనకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి 5 లక్షలు డిమాండ్ చేశాడంటూ విద్యార్థిని తండ్రి రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో ఓ యువకుడి బైక్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు