నిజామాబాద్
తెలంగాణ యూనివర్సిటీ లో నకిలీ పట్టాలు లు కలకలం రేపుతున్నాయి. డిగ్రీ, పీజీ నకిలీ పట్టాలు హైదరాబాద్ లో వెలుగు చూసాయి. నకిలీ పట్టాలను రాజధానిలోని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో హైదరాబాద్ పోలీసులు నిజామాబాద్ డిచ్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యూనివర్సిటీ అధికారులతో జరిపిన విచారణలో ముద్రించిన పట్టాలు యూనివర్సిటీవి కావని స్పష్టం అయ్యాయి. అచ్చం వర్సిటీ జారీచేసే ఒరిజినల్ పట్టాల మాదిరిగానే నకిలీ పట్టాలు వున్నాయి. తెవివి పేరుతో నకిలీ పట్టాలు వెలుగు చూడటం ఇదే తొలిసారి. గతంలో పట్టుబడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాలలో నకిలీ ముఠాల విషయం తెలిసిందే. నకిలీ పట్టాల జారీ వెనుక యూనివర్సిటీ సిబ్బందిలో ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.