పోలవరం
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేదిశలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు గురువారం పోలవరం కి చేరుకున్న స్పెషల్ సీఎస్ జలవనరుల అధికారులతో, మేఘ కన్స్ట్రక్షన్ ప్రతినిధుల తో క్షేత్ర స్థాయిలో పర్యటన సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.
అనంతరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యటించి పోలవరం స్పిల్ వే, బ్రిడ్జి, గేట్ల పనులను పరిశీలించిన ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి వెంట ఈఎన్సీ నారాయణ రెడ్డి ఉన్నారు. టనెల్స్ ల పరిశీలన లో భాగంగా 63, 64 టనెల్స్, పవర్ రెగ్యులేటర్, ఆఫ్ టూ రెగ్యులేటర్ బండ్ -2, గ్యాప్ 3 పనులను పరిశీలించారు.
స్పిల్ వే ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై ,వివిధ దశల్లో చేపట్టిన, పూర్తి చేసిన పనుల పురోగతి పై ఏర్పాటు చేసిన ఫోటో, యాక్షన్ ప్లాన్ ప్రదర్శన ను తిలకించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పోలవరం ఎస్ ఈ నరసింహ మూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఈ బి. కృష్ణ, ఆదిరెడ్డి, తదితర అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ముద్దు కృష్ణ, ఏజిఎం రాజేష్ కుమార్, మేనేజర్ మురళి, తదితరులు పాల్గోన్నారు.