YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

70 రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి

70 రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి

బీజింగ్‌ డిసెంబర్ 16
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్నది. వేగంగా విస్తరిస్తున్న వేరియంట్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు శాస్త్రవేత్తలను సైతం కలవరపెడుతున్నది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో కొత్త ఉత్పరివర్తనం వేగంగా వ్యాప్తిచెందే లక్షణాలున్నట్లు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 70కిపైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారితో మళ్లీ దాదాపు లాక్‌డౌన్‌ పరిస్థితులను సృష్టిస్తోందని అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఒమిక్రాన్‌ బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒమిక్రాన్‌కు సంబంధించిన అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌-19 అసలైన వైరస్‌, డెల్టా వేరియంట్‌ కంటే 70 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. అయినా తీవ్రమైన అనారోగ్యం బారినపడే ప్రమాదం గణనీయంగా తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అధ్యయనంలో శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్‌ మానవ శరీరంలోని ఏ భాగాలను ఎక్కువ ప్రభావం చేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
70రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి
కరోనా స్ట్రెయిన్‌పై హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. మహమ్మారి తీవ్రతను తెలుసుకునేందుకు అధ్యయనం చేపట్టారు. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లలో కంటే ఒమిక్రాన్‌తో ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. డెల్టా సహా అన్ని వేరియంట్ల కంటే 70 రెట్లు వేగంగా బ్రోంకస్‌ (ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపే దిగువ శ్వాసకోశంలోని ఓ వాయునాళం) లో వ్యాప్తి చెందగల గుణం ఉందని తెలిపారు.
ఊపిరితిత్తులపై ప్రభావం తక్కువే
డెల్టా, ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఊపిరిత్తులపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం తక్కువగానే ఉందని అధ్యయనంలో తేలింది. అందుకే ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా మారడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ భిన్నమైన వేరియంట్‌ తీవ్రత ఎందుకు తక్కువగా ఉందో తెలుసుకునేందుకు పరిశోధకులు ఎక్స్‌-వీవో (Ex vivo) కల్చర్‌పై అధ్యయనం చేపట్టారు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయంలోని అసోసియేట్‌ ప్రొపెషర్‌ మైఖేల్‌ చాన్‌ చివై ఆధ్వర్యంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్‌గా గుర్తించినా.. మరీ ఎక్కువ ప్రమాదకరమైంది కాదని బృందం పేర్కొంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌ సోకిన 24 గంటల తర్వాత డెల్టా, సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ల కంటే 70రెట్లు వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
కణజాలంపై తక్కువ ప్రభావం.. కానీ
ప్రస్తుతానికి ఉన్న శుభవార్త ఏంటంటే ఇతర వైవిధ్యాల కంటే పది రెట్లు తక్కువగా మానవ కణజాలాన్ని ప్రభావితం చేస్తుందని, అలాగే తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిందని పేర్కొన్నారు. అయితే, మహమ్మారి తీవ్రత తక్కువైనా ఎక్కువ మందికి సోకితే మరణాలకు కారణమవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ మైఖేల్‌ చాన్‌ పేర్కొన్నారు. వేరియంట్‌ ప్రభావం మనిషిలోని రోగ నిరోధకశక్తిపై కూడా ఆధారపడి ఉంటుందన్న ఆయన.. తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, దాని వేగవంతమైన పెరుగుదల తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. వేరియంట్‌ను నియంత్రించడం చాలా ముఖ్యమైందన్నారు.

Related Posts