YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేలపై అసంతృప్తి...

ఎమ్మెల్యేలపై అసంతృప్తి...

గుంటూరు, డిసెంబర్ 17,
2014లో ఓడిన వైసీపీ 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయబావుటా ఎగుర వేసింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఇతర వృత్తుల్లో ఉంటూ సీటు రాగానే వచ్చి పోటీ చేసిన అనామకులను సైతం గెలిపించేసింది జగన్ గాలి.అయితే ప్రతి జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై పుంఖాను పుంఖాలుగా హైకమాండ్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేల అక్రమ కార్యకలాపాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అడిగేవారు ఎవరూ లేరన్నట్టు ఇష్టారీతిన కలెక్షన్లు చేసేస్తున్నారు కొంత మంది ఎమ్మెల్యేలు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే దందాలను ఈ మధ్య ఓ రాజ్యసభ సభ్యుడు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. ఆ ఎమ్మెల్యే చేస్తున్న వసూళ్లు, అక్రమదందాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని జగన్‌కు చెప్పారట.. ఆ ఎంపీ. అతన్ని పిలిచి మాట్లాడాలని, హెచ్చరించాలని ఎంపీ సూచించారట. అంతా విన్న సీఎం జగన్… అతన్ని మనం తీసేస్తాం కదన్నా…. సీటు కూడా ఇవ్వం… ఇంకేం అవుతుంది అన్నారట.గుంటూరు జిల్లా పల్నాడులో ఓ ఎమ్మెల్యే నెల ఆదాయం మూడు కోట్లు అని ప్రచారం జరుగుతోంది. అదంతా టార్గెట్లు పెట్టిమరీ వసూలు చేస్తున్నదేనట. ఇంకో ఎమ్మెల్యే ఏకంగా దుకాణం తెరిచారట. వెంచర్ వేసినా.. అపార్ట్‌మెంట్ కట్టినా ఎమ్మెల్యే ఫిక్స్ చేసినంత ఇచ్చుకోవాల్సిందేనట. అలా ఇచ్చిన బిల్డర్లు… కొనుగోలుదారుల నుంచి ఆ డబ్బును వసూలు చేస్తుండటంతో వారి మీద అదనపు భారం పడుతోందట. అదే జిల్లాలో ఓ ఎమ్మెల్యే పని తీరుపై మొదటి సంవత్సరంలోనే హైకమాండ్ పూర్తి అసంతృప్తికి వచ్చేసిందట. ఏకంగా పేకాట శిబిరాలు నడిపించడమేకాక.. పార్టీ కేడర్‌తో గొడవపడిన ఆ ఎమ్మెల్యేకి ఈసారి సీట్ కట్ అనే చర్చ పార్టీలో జరుగుతోంది.అనంతపురం, కడప జిల్లాల్లోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరు ఇదేనట. కొంతమంది అయితే మూడు నెల్లకు, నాలుగు నెల్లకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను బదిలీ చేయిస్తూ… కొత్త వారిని తెచ్చకుంటూ బాగా వెనుకేసుకుంటున్నారట. ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఓ సీఐ బదిలీ కోసం ఇన్నోవా తీసుకున్నారట. ఆ విషయం హైకమాండ్ దృష్టికి రావడంతో ఆ డబ్బు వెనక్కి ఇప్పించారట. అదే జిల్లాలో పక్క జిల్లా నుంచి వెళ్లి మరీ ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాంట్రాక్టు పనుల్లో కమీషన్ కొట్టేస్తున్నారని ఓ మంత్రే స్వయంగా సీఎంకు కంప్లైంట్ చేశారట. పార్టీ నేతలకు పనులు ఇస్తే కమిషన్ అడగటం ప్రాబ్లం అవుతుందని… పక్క పార్టీల నుంచి చేరిన, చేర్చుకున్న వారికి కాంట్రాక్టులు ఇప్పించి మరీ కమీషన్ తీసుకుంటున్నారట. ఇలాంటి వారిని ఏం చేయాలో అర్ధం కావడం లేదని… ఆ మంత్రి జగన్ దగ్గర వాపోయారట.ఇలాంటి వాళ్లు జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారట. కొంత మంది అక్రమ వసూళ్లు, సంపాదనకు తెర తీస్తే… ఇంకొందరు కేడర్ తో సత్సంబంధాలు నెరపడంలో, వారితో సఖ్యతగా ఉండటంలో విఫలం అవుతున్నారట. డబ్బు పెట్టాం గెలిచాం… ఇక కార్యకర్తలతో మనకేం పని అన్నట్టుగా ఇంకొందరు ఉంటున్నారట. ఇలాంటి వాళ్ల జాబితా ఇంకొకటి కూడా హైకమాండ్ చేతిలో ఉందట. వచ్చే ఏడాది జనవరి నుంచి పీకే టీం వస్తుందని…. సర్వే చేస్తుందని ఇంతకు ముందు జగన్ కేబినెట్ లో చెప్పారు. ఆ టీం వచ్చాక…. ఈ తరహా ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి చిట్టాలతోపాటు అక్కడ జనం ఏం అనుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటున్నారు? అనే సమాచారం సేకరించాలని పార్టీ నిర్ణయించింది. అటు కార్యకర్తల నుంచి వ్యతిరేకత…. ఇటు అవినీతి అరోపణలతో జనామోదంలేని వాళ్లకు తిరిగి సీట్లు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. భారీ సంఖ్యలో సీట్లు సాధించిన పార్టీలో మళ్లీ గెలవడానికి కనీసం మూడో వంతు మందిని మార్చేస్తుంటాయి. కొత్త వారికి సీట్లు ఇస్తుంటాయి. ఏపీలో కూడా అలాగే జరగవచ్చని అంటున్నారు. అదే జరిగితే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఎంతమందికి సీట్లు లేకుండాపోతాయో.

Related Posts