విజయవాడ
పాదరక్షలపై జీఎస్టీ 5% నుండి 12% కి పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ఫుట్ వేర్ మానుఫ్యాక్షరింగ్, ,డీలర్స్ అసోసియేషన్ నేతలు అన్నారు. జీఎస్టీ పెంచడం కారణంగా ప్రజలపై 145 శాతం పన్ను అదనపు భారం పడుతోంది. జీఎస్టీ పెంచడంతో పాదరక్షల వ్యాపారం దెబ్బతిని ఈరంగంలో పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. నాష్ట్రంలో సుమారుగా 700 మంది హోల్ సెల్ వ్యాపారులు,6500 రిటైల్ షాపులు ఉన్నాయి. జీఎస్టీ పెంపుదలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలి. రేపు విజయవాడలో ర్యాలీ చేపట్టనున్నామని వెల్లడించారు.