YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీ బలోపేతంపైదృష్టి పెట్టండి

పార్టీ బలోపేతంపైదృష్టి పెట్టండి

హైదరాబాద్, డిసెంబర్ 17,
తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు దాదాపు 310-340 మంది కీలక నేతలు హాజరైన ఈ సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్ని స్థాయిల గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.రాష్ట్రంలో యాసంగి పంటల మార్పిడి, బీజేపీ ధ్వంద్వ విధానాలు, దళిత బంధు కార్యక్రమాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులకు శిక్షణతో నామినేటెడ్ పదవుల భర్తీ తదితరుల అంశాలపై విస్తృతంగా వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, టీఆర్‌ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ చేస్తున్న విష ప్రచారం తిప్పి కొట్టాలని సూచించారు. ప్రధానంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఒక మాట, రాష్ట్ర బీజేపీ నేతలు మరోమాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రైతులను కాపాడుకోవటానికి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై ఓ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, అన్ని స్థాయిల శ్రేణులకు శిక్షణా తరగతుల నిర్వహణ వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ సందడిగా మారింది. ఆహ్వానితులను మాత్రమే లోనికి అనుమతినిస్తూ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

Related Posts