హైదరాబాద్ డిసెంబర్ 17
నైపుణ్యం ఉంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నదని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో కోటెలిజెంట్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కోటెలిజెంట్ ఒప్పందం కుదుర్చుకున్నది. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు.ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని, దేశంలో వందకోట్లకుపైగా జనాభా ఉందని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండదని చెప్పారు. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని సూచించారు.డేటా ప్రొటెక్షన్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని ట్విటర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురైందన్నారు. సైబర్ క్రైమ్‌కు సైబర్ సెక్యూరిటీ పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. భవిష్యత్‌లో సైబర్ యుద్ధాలే జరుగుతాయని వెల్లడించారు.