YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ వైసీపీ ట్రాప్ లో టీడీపీ

మళ్లీ వైసీపీ ట్రాప్ లో టీడీపీ

విజయవాడ, డిసెంబర్18,
చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారా? ఆ అనుమానం ఎందుకు పడినట్లే కనపడుతుంది. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తరచూ ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు ఆయనకు కొన్ని సామాజికవర్గాలను మరింత దూరం చేస్తున్నాయి. ఒక్కొక్క అంశం వైసీపీ తెలివిగా చంద్రబాబును ట్రాప్ చేస్తుందనే అనుకోవాలి. మూడు రాజధానుల అంశం కావచ్చు. జస్టిస్ చంద్రుపై విమర్శలు కావచ్చు. చంద్రబాబు వైసీపీ ట్రాప్ లోపడినట్లే కనిపిస్తుంది. మూడు రాజధానుల అంశాన్ని తీసుకుంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులు అమరావతిని రాజధానిగా ఉంచాలని భావిస్తున్నారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో తమకు న్యాయం జరగాలని, ఒక్క ప్రాంతానికే చంద్రబాబు మేలు చేస్తున్నారన్న వాదన బలంగా విన్పిస్తుంది. మూడు రాజధానుల అంశం జగన్ ప్రభుత్వం లేవనెత్తగానే దానికి అభ్యంతరం చెబుతూ చంద్రబాబు రెండు ప్రాంతాల్లో తన పార్టీని మరింత బలహీనం చేసుకున్నారు. టీడీపీ సెల్ఫ్ గోల్.... రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలే లోలోపల మూడు రాజధానులను సమర్థిస్తున్నారు. కానీ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఉత్తరాంధ్రలో కొండ్రుమురళి వంటి వారే బాహాటంగా మూడు రాజధానులను సమర్థించారు. తిరుపతిలో సభ పెట్టినంత మాత్రాన సీమ మొత్తం ఒకే అన్నట్లు కాదు. రాజధానికి దగ్గరగా ఉండే నాలుగు జిల్లాలనే వారు అందుకే ఎంచుకున్నారని, దీని వెనక చంద్రబాబు ఉన్నారని వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక జస్టిస్ చంద్రు విషయాన్ని చూసుకుంటే ఏపీలో ప్రధానమైన ఒక సామాజికవర్గాన్ని, మేధావులను చంద్రబాబు స్వయంగా దూరం చేసుకున్నట్లయింది. జస్టిస్ చంద్రు పదవుల కోసమే న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ చక్కగా ఉపయోగించుకుంటుంది. జస్టిస్ చంద్రుకు మంచి పేరుంది. సమర్థవంతమైన, నిజాయితీగల న్యాయమూర్తిగా ఆయన అందరికీ సుపరిచితులు. జై భీమ్ సినిమాతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. అటువంటి చంద్రు పై చంద్రబాబు నెగిటివ్ కామెంట్స్ చేసి ప్రధానమైన వర్గాన్ని మరింత దూరం చేసుకున్నారంటున్నారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం అనేక మంది వ్యక్తం చేస్తున్నారు.

Related Posts