YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

త్వరలో కేబినెట్ విస్తరణ

త్వరలో కేబినెట్ విస్తరణ

హైదరాబాడ్, డిసెంబర్ 18,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం విస్తరణకు సిద్దమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, మారుతున్న పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్ళవలసి వచ్చినా అందుకు సిద్దంగా ఉండే విధంగా, పార్టీలో అదే విధంగా మత్రి మండలిలో మార్పులు చేర్పులు చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్,ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్య నేతలు కొందరికి సంకేతం ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే, ముఖ్యమంత్రి స్వయంగా జిల్లా పర్యటనలకు బయలు దేరుతున్నారు. మరో వంక నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మంత్రి వర్గ విస్తరణ కసరత్తు కూడా చేస్తున్నారు. కాగా, మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఈసారి బీసీ, ఎస్సీలకు  అదే విధంగా మండలి సభ్యులకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన మండలి ఎన్నికలలో ఏకంగా ఒకే సారి 19 మంది అధికార పార్టీ సభ్యులు ఎన్నికయ్యారు.నిజానికి మండలిలో ప్రతిపక్ష సభ్యులు కేవలం దిష్టి చుక్కల్లా మాత్రమే మిగిలారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. అధికార టీఆర్ఎస్. సభ్యుల సంఖ్య 34కు చేరింది. వీరు గాక మరో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అంటే, ఆ ఇద్దరితో కలిపి టీఆర్ఎస్ సంఖ్యా బలం 36 కు చేరింది. ఇందులో ముఖ్యమంత్రి కుమార్తె కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్ గుత్తా  సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇలా చాలామంది హేమాహేమీలున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న ‘పెద్దలు’ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాగే, దిగువ సభలోనూ  మంత్రి పదవులు ఆశిస్తున్నవారు, కుల సమీకరణాల దృష్ట్యా అవసరంగా మంత్రి వర్గంలోకి తీసుకోవలసినవారు ఉన్నారు. అయితే, ఈసారి మంత్రి వర్గం కూర్పుతో పాటుగా మండలి చైర్మన్, ఉప చైర్మన్, చీఫ్ విప్ ఇతర పదవులను, పార్టీ పదవులను కూడా కలుపుకుని ఒకే సారిగా, మార్పులు చేర్పులు చేపట్టీ ఆలోచనలో  ముఖ్యమంత్రి ఉన్నారని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కునేందుకు సైన్యాన్ని సిద్దం చేస్తున్నారని అంటున్నారు. కాగా,రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా ఎన్నికైనా  బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌కు మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని  అంటున్నారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అదే సామాజిక  వర్గానికి చెందిన బండాకు  మంత్రివర్గంలో  ఖాయంగా స్థానం  దక్కుతుందని, అంటున్నారు. అలాగే, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వేగంగా  మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాలను అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.ఇందులో భాగం రెడ్డి, వెలమ సామాజిక వర్గాలపై వేటు పడే అవకశం ఉందని అంటున్నారు. అలాగే, కుల సమీకరణాలు, రాజకీయ అవసరాల దృష్ట్యా ఇంద్దరు ముగ్గురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసనలు  ఉంటాయని అంటున్నారు. అయితే ఎవరా ఇద్దరు ముగ్గురు .. ఆనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

Related Posts