విశాఖపట్నం
విశాఖ జిల్లా ఏజన్సీ పర్యాటక ప్రాంతా లు సందడిగా మారాయి.వంజంగి మేఘాల కొండలను తిలకించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివ చ్చారు.కొందరు పర్యాటకులు రాత్రే వంజంగి కొండలకు చేరుకోగా, మరికొం దరు తెల్లవారుజామున అక్కడి తరలి వెళ్లారు.తెల్లవారుజామున క్షీర సాగరం లా కన్పించే మేఘాలు చూడముచ్చ టగా ఉండే భానోదాయాన్ని తిలకిం చారు. అలాగే జి.మాడుగుల మండ లం కొత్తపల్లి జలపాతాన్ని తిలకించేం దుకు సందర్శకులు పోటెత్తారు. ఆది వారాన్ని తలపించేలా పాడేరు, జి.మా డుగుల మండల కేంద్రాలు పర్యాటకు లతో కిటకిటలాడాయి.