YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి

విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి

హైదరాబాద్
హైదరాబాద్  బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని  అఖిల భారత విద్యార్థి పరిషత్  విద్యార్దులు ముట్టడించారు.  క్లాస్ లు చెప్పకుండా పరీక్షలు పెట్టి 48 % మాత్రమే పాస్ చేసి 52 % విద్యార్థులను ఫేల్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ  కార్యాలయం ముందు అందోళనకు దిగారు. ఈ నేపద్యంలో పోలీసులు భారీగా మోహరించారు.  ర్యాలీగా వచ్చిన విద్యార్థులు గేట్లు తొసుకుని కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.  పరిస్థితి విషమించడంతో విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అబిడ్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  ఇంటర్ మొదటి సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు వెంటనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలి.   విద్యార్థి ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అందోళనకారులు డిమాండ్ చేసారు.

Related Posts