YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

జేఎన్టీయూ లో జాబ్ మేళా

జేఎన్టీయూ లో జాబ్ మేళా

హైదరాబాద్
కూకట్ పల్లి జె.ఎన్.టి.యులో మెగా జాబ్ మేళా తెలంగాణ గవర్నర్ తమిళిసై శనివారం  ప్రారంభించారు.  నిపుణ, సేవ ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళా లో 144 కంపెనీలు పాల్గొన్నాయి. పదివేల మందికి జాబ్ కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మేళా లో సుమారు 65 వేల మంది నిరుద్యోగులు తమ పేర్లు  నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన నైపుణ్యాన్ని ప్రతిరోజు మెరుగుపరచుకో వాల్సి0 దేనని  లేనిపక్షంలో  అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు.  ప్రధాని మోడీ చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అప్ ఇండియాలతో ప్రపంచంలోనే ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని యువతకు సూచించారు.
జాబ్ మేళా ఆర్గనైజర్లు శ్యామ్ కోసిగి, శ్రీకాంత్ కొండ మాట్లాడుతూ జాబ్ మేళా కు తాను అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన లభించిందని అయితే జాబు రానివారికి శాతం మరిన్ని ఏర్పాటు చేయడం ద్వారా జాబులు కల్పిస్తామన్నారు సేవ ఇంటర్నేషనల్ ద్వారా భారత్ లో తమ సేవలు కొనసాగిస్తామన్నారు

Related Posts