న్యూ ఢిల్లీ డిసెంబర్ 18
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని టి ఎమ్ ఆర్ పి ఎస్, సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు పోకల కిరణ్ కుమార్ డిమాండ్ చేసారు. పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టించాలని లేని పక్షం లో తెలంగాణాకు చెందినా ఎంపి లను రాష్ట్రం లోకి అడుగు పెట్టనివ్వబోమని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. శనివారం డిల్లి లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ తమపార్టీ అధికారం లోకి వస్తే 100 రోజుల్లో ఎస్ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతామన్న బిజెపి పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిందని విమర్శించారు. 27 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అనేక మిలిటెంట్ పోరాటాలు చేసి జైలు పాలై పోలీస్ లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి జాతి ఆత్మగౌరవ పోరాటం లో కష్టపడ్డానని ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం కేవలం విభజించడం శత్రుత్వం పెంచడమే కాదని మాల మాదిగ ఉపకులాల ఉమ్మడిగా కలిసి శాస్త్రీయంగా పంచుకోవడమే సరైన మార్గమని ఇదే ఈ దీక్ష ద్వారా తెలియ పరచడం జరిగింది ఇది భవిష్యత్తు రాజ్యాధికార పోరాటానికి పునాది వేసే విధంగా భారత దేశ వ్యాప్తంగా ఉన్న దళిత ప్రజాసంఘాల నాయకులను ఐక్య పరుస్తూ ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు.నేడు బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో లో ఎస్సీ వర్గీకరణ వందరోజుల ఇస్తామని వాగ్దానం చేసి కొంత మంది ఉద్యమకారులు అడ్డుపెట్టుకొని మాల మాదిగ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. బిజెపికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టి రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎస్టీ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన పెంచాలి శాస్త్రీయంగా ఏబిసిడి వర్గీకరణ పై పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలని, దళితుల్లో క్రీమీలేయర్ ప్రవేశపెట్టి రిజర్వేషన్స్ కేంద్రీకృతం కాకుండా చూడాలని, బీసీల జన గణన వెంటనే చేపట్టాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని,మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీలకు జల్ జంగల్ జమీన్ పై హక్కులు కల్పించాలని డిమాండ్ చేసారు.