న్యూఢిల్లీ, డిసెంబర్ 20,
చైనాలో పుట్టిన మాయదారి కరోనా మహమ్మారి.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంది.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి… భారత్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలంటూ.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారిని కూడా చైతన్యం చేసే కార్యక్రమం జరుగుతోంది.. ఇక, భారత్‌లో నిన్నటి వరకు 137 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ జరిగింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ అందిస్తూ వస్తోంది భారత్.. ఇప్పటివరకు ప్రపంచంలోని 90కి పైగా దేశాలు భారత్ నుంచి వ్యాక్సిన్‌లు దిగుమతి చేసినట్టు వెల్లడించారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్.భారత్-సెంట్రల్ ఏసియా సమావేశంలో పాల్గొన్నా జయశంకర్.. వ్యాక్సిన్‌ల తయారీ, ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతుందని తెలిపారు.. కోవిడ్ మహమ్మారి సమయంలో వివిధ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమం ఆయా దేశాలతో సంబంధాల వేగాన్ని స్తంభించేలా చేసిందన్న ఆయన.. ఈ పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్‌తో మనందరికి మంచి సంబంధాలు ఉన్నాయని.. కానీ, అక్కడ ఉగ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరా.. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను కాలరాయడం ఆందోళన కలిగించే అంశాలుగా పేర్కొన్నారు.. కాగా, ఢిల్లీలో భారత్ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.