YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మళ్లీ జెట్ ఎయిర్ వేస్...

మళ్లీ  జెట్ ఎయిర్ వేస్...

ముంబై, డిసెంబర్ 20,
కొత్త ప్రమోటర్ల చేతికి వచ్చిన జెట్ ఎయిర్ వేస్ కొత్త సంవత్సరంలో మళ్లీ విమానాలు నడపడానికి రెడీ అవుతోంది. ఆరు విమానాలతో 2022లో ఆపరేషన్స్ మొదలు పెట్టనున్నట్లు కొత్త ఓనర్లు చెప్పారు. ఇందుకోసం  రిజొల్యూషన్ ప్లాన్ అమలును వేగవంతం చేయాల్సిందిగా ఎన్సీఎల్టీని కోరినట్లు పేర్కొన్నారు. దివాలా అంచులకి చేరడంతో ఈ ఎయిర్లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జలాన్–కల్రాక్ కన్సార్టియమ్ జెట్ ఎయిర్వేస్ను చేజిక్కించుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంట్రప్రెనూర్ మురారి జలాన్, బ్రిటన్ కంపెనీ కల్రాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్లు కన్సార్టియమ్గా ఏర్పడ్డాయి. ఉద్యోగులు సహా బాకీదారులందరికీ చెల్లింపులు జరపడానికి కన్సార్టియమ్ సిద్ధంగా ఉందని కంపెనీ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. జూన్ 2021లో ఎన్సీఎల్టీ ఆమోదించిన రిజొల్యూషన్ ప్లాన్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. రిజొల్యూషన్ ప్లాన్ ఎఫెక్టివ్ డేట్గా డిసెంబర్ 22 ని పరిగణించమని ఎన్సీఎల్టీని కోరినట్లు కూడా కొత్త యజమాన్యం వెల్లడించింది. బాకీదారులకు రాబోయే అయిదేళ్లలో రూ. 1,183 కోట్లను చెల్లించేందుకు కన్సార్టియమ్ అంగీకరించింది. అంతేకాకుండా,  మొదటి రెండేళ్లలో రూ. 600 కోట్ల మేర చెల్లింపుల జరపడానికి ఫండ్స్ రెడీ చేసేందుకూ ఒప్పుకుంది. మిగిలిన మొత్తాన్ని ఆ తర్వాత  ఏళ్లలో చెల్లిస్తారు. 2022లో ఆపరేషన్స్ మొదలపెట్టాలనే ఉత్సాహంతో ఉన్నట్లు జలన్ చెప్పారు.చాలా ఆలోచించే జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాన్ని జలన్తో కలిసి తీసుకున్నట్లు  కల్రాక్ క్యాపిటల్ చైర్మన్ ఫ్లోరియన్ ఫ్రిట్చ్ వెల్లడించారు. ఆపరేషన్స్ ప్రారంభించడం కోసం వివిధ ప్రభుత్వ విభాగాలతో డిస్కషన్స్ మొదలయినట్లు కూడా పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం 35 వేల అప్లికేషన్స్ వచ్చాయని, కేండిడేట్లను ఎంపిక చేసే ప్రాసెస్‌‌లో ఉన్నామని కన్సార్టియమ్ వెల్లడించింది. కాగా,  వివిధ ఎయిర్పోర్టులలోని స్లాట్లను తీసుకోవడం వంటి వాటిలో జాప్యం కారణంగా జెట్ ఎయిర్వేస్ ఆపరేషన్స్ రీలాంఛ్ ఆలస్యం అయింది.

Related Posts