YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం జిల్లాలో టీడీపీలో కొత్త టెన్షన్

ప్రకాశం జిల్లాలో  టీడీపీలో కొత్త టెన్షన్

ఒంగోలు, డిసెంబర్ 20,
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి?గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్ లేదు. దీంతో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటిలా సర్వే బృందాలను రంగంలోకి దించారట చంద్రబాబు. రాబిన్శర్మ బృందాన్ని ఫీల్డ్లోకి పంపారట. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండగా పార్టీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయంతో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జుల్లో టెన్షన్ మొదలైందని సమాచారం.జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి.. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జుల పనితీరు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు.. అందరినీ కలుపుకొని వెళ్తున్నారా లేదా అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లాలోని తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ.. పశ్చిమ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అందుకే పశ్చిమ నియోజకవర్గాల్లో మరింత లోతుగా రాబిన్శర్మ టీమ్ సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది.కేవలం ప్రజల దగ్గరకే కాకుండా.. మేధావి వర్గాన్ని కూడా సర్వే బృందం కలిసి అభిప్రాయ సేకరణ చేస్తోందట. ఈ సర్వే ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో.. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు.. ఈ విషయంపై చాలా సీరియస్గానే దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు. జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో పార్టీ బలంగా లేదన్న సంగతి సర్వే బృందాలకు అధిష్ఠానం చెప్పిందట. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు.. ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆరా తీస్తున్నారట. పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు వచ్చాక పలువురు టీడీపీ ఇంఛార్జులను మారుస్తారనే ప్రచారం ఉందిజిల్లాలో చీరాల, కందుకూరులకు టీడీపీ ఇంఛార్జులు లేరు. అక్కడ ఎవరిని ఇంఛార్జ్ను చేస్తే.. పార్టీకి బలం చేకూరుతుందో కూడా ఆరా తీయమన్నట్టు సమాచారం. సర్వే అనంతరం అన్నిచోట్లా గెలుపు గుర్రాలకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. మరి.. రాబిన్శర్మ బృందం సర్వేలో పార్టీ బలోపేతానికి సూచించే అంశాలు టీడీపీకి ఎంత మేరకు వర్కవుట్ అవుతాయో.. ఎంతమంది కుర్చీలు కదులుతాయో చూడాలి.

Related Posts