శ్రీకాళహస్తి
గ్రహణ గండాలకు అతీతంగా ఏప్పుడు భక్తుల కు దర్శనమిచ్చే శ్రీకాళహస్తిశ్వరాలయం లో ఆరుద్రను పురస్కరించుకుని సోమవారం స్వామి, అమ్మవారి ప్రదాన ఆలయాల మూసేశారు. శ్రీకాళహస్తిశ్వరుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని ఆలయం లోని శ్రీ జ్ణానప్రసునాంబిక సమేత స్వామివారి ద్రువమూర్తులకు వేడి నీళ్ళ తో ఏకాంతం గా అబిషేకాలు జరపడం ఇక్కడి సంప్రదాయం. ఉష్ణోదక అబిషేకాల ను పురస్కరించుకుని దాదాపు నాలుగు గంటలకు పైగా స్వామి అమ్మవార్ల ఆలయాలు ముసేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొంత ఇబ్బందికర పరిస్థితుల ను ఎదురుకున్నారు. ఉత్సవ మూర్తుల ను దర్శించుకుని వెళ్ళాల్సి వచ్చింది. సోమవారం శివుడు కి ప్రీతి పాత్రమైన రోజు ఆరుద్ర నక్షత్రం రావడం ఇదే తొతోలి సారి. ఆరుద్ర సందర్బంగా ఆలయ ఆవరణలో సోమవారం శ్రీ శివకామసుందరి సమేత నటరాజ స్వామి ఉత్సవవ మూర్తుల ను విశేష అబిషేకాలు జరిపి పుర వీదుల్లో ఊరేగించారు.