న్యూఢిల్లీ డిసెంబర్ 20
లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ప్రవేశపెట్టారు. ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును తీసుకువచ్చారు. లోక్‌సభలో ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.విపక్ష నేతలు అసదుద్దీన్ ఓవైసీ, శశిథరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆధార్‌ను కేవలం అడ్రస్ ప్రూఫ్‌గా వాడారని, కానీ అది పౌరసత్వ ద్రవీకరణ పత్రం కాదు అని శశిథరూర్ అన్నారు. ఓటర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.