YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓట‌రు కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు లోక్‌స‌భ‌లో ఆమోదం

ఓట‌రు కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు లోక్‌స‌భ‌లో ఆమోదం

న్యూఢిల్లీ డిసెంబర్ 20
ఓట‌రు కార్డుతో ఆధార్ అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్‌స‌భ‌లో ఆమోదం ద‌క్కింది. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021.. మూజువాణి ఓటు ద్వారా క్లియ‌రెన్స్ పొందింది. అయితే ఇవాళ మ‌ధ్యాహ్నం స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓట‌రు కార్డుతో ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి అయ్యింది. ఇక నుంచి ఓటు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నుకునే వారి నుంచి ఎన్నిక‌ల రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్లు ఆధార్ నెంబ‌ర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవ‌స‌రం అవుతుంద‌ని మంత్రి రిజిజు తెలిపారు. మూజు వాణి ఓటు ద్వారా బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉద‌యం ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ 2021 బిల్లును మంత్రి రిజిజు ప్ర‌వేశ‌పెట్టారు. ఆ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకించాయి.ఓట‌రు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాల‌న్న ఉద్దేశంతో ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును కేంద్రం తీసుకువ‌చ్చింది. లోక్‌స‌భ‌లో ఈ బిల్లును విప‌క్షాలు వ్య‌తిరేకించాయి. బోగ‌స్ ఓటింగ్‌, న‌కిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం త‌ప్ప‌ద‌ని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చ‌ట్టం ప్ర‌కారం ఆధార్‌ను ఓట‌ర్ కార్డుతో అనుసంధానం చేయ‌రాదు అని కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ అన్నారు. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విప‌క్ష నేత‌లు అస‌దుద్దీన్ ఓవైసీ, శ‌శిథ‌రూర్ కూడా ఈ బిల్లును వ్య‌తిరేకించారు. ఆధార్‌ను కేవ‌లం అడ్ర‌స్ ప్రూఫ్‌గా వాడార‌ని, కానీ అది పౌర‌స‌త్వ ద్ర‌వీక‌ర‌ణ ప‌త్రం కాదు అని శ‌శిథ‌రూర్ అన్నారు. ఓట‌ర్ల‌ను ఆధార్ అడిగితే, అప్పుడు కేవ‌లం అడ్ర‌స్ డాక్యుమెంట్ మాత్రమే వ‌స్తుంద‌ని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హ‌క్కు క‌ల్పిస్తున్న‌ట్లు అవుతుంద‌ని ఎంపీ శ‌శిథ‌రూర్ ఆరోపించారు. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి తెలిపారు.

Related Posts