YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎండకు వేగిపోతున్న కూలీలు

ఎండకు వేగిపోతున్న కూలీలు

పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9 దాటితే జనాలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్న పరిస్థితి. అయితే కార్యాలయాలకు, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారికి ఎండ నుంచి సమస్యలు తప్పడంలేదు. వీరందరికంటే ఉఫాధి కూలీల వెతలే అధికంగా ఉన్నాయి. ఉఫాధి హామీ పథకం కింద కొనసాగుతున్న పనుల వద్ద కూలీలకు సరైన వసతులు ఉండడంలేదు. దీంతో కూలీలకు ఎండ నుంచి తప్పించుకునే మార్గం లేకపోయింది. కూలీలు సేద తీరేందుకు కొన్ని ప్రాంతాల్లో నీడ ఉండడంలేదు. దీంతో వారు ఎండలోనే నిలిచి ఉండాల్సి వస్తోంది. దీంతో పలువురురు వడదెబ్బకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలు మధ్యాహ్నం వరకు పని చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా చెరువు పూడికతీత, కట్టుకాల్వల పనులు జరుగుతున్నాయి. దీంతో పరిసరాల్లో చెట్ల నీడ సైతం లేని దుస్థితి. ఫలితంగా కూలీలు నీరసించిపోతున్నారు. 

 

రాష్ట్రవ్యాప్తంగా ఉఫాధికూలీలు ఎండలో మాడిపోతున్న దుస్థితే ఉంది. గతేడాది ఉపాధి కూలీల కోసం సర్కార్ మెడికల్‌ కిట్లు అందించింది. అయితే ఈసారి కొన్నిప్రాంతాల్లో ఈ తరహా కిట్లు పంపిణీ కాలేదని సమాచారం. దీంతో పనిచేసే ప్రదేశంలో ప్రథమ చికిత్స అందించే అవకాశం లేకుండాపోతోందని కూలీలు వాపోతున్నారు. ఎండలో పనిచేసి నీరసించే కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు ఇవ్వాల్సి ఉన్నా క్షేత్ర సహాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత యంత్రాంగం సత్వరమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో ఎండ నుంచి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. ఇదిలాఉంటే ఎండలు విజృంభిస్తుండడంతో పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు నిర్వహించేలా కొన్ని ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ వెసులుబాటు కొన్ని ప్రాంతాల్లో లేకుండా ఉంది. అలాంటి చోట్ల కూలీలకు వెతలు తప్పడంలేదు.

Related Posts