YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పట్టుకోసం నానా తంటాలు

పట్టుకోసం నానా తంటాలు

నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వైసీసీ ముమ్మర యత్నాలు మొదలెట్టింది. గతంలో పార్టీకి విధేయులుగా ఉండే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోన్న మాజీలను తిరిగి పార్టీలో రప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొందరితో ఇప్పటికే మంతనాలు జరుపు తోంది. ఈసారి అధికారంలోకి వచ్చింది వైసీపీనే.. పార్టీలోకి వస్తే పదవితో పాటు సముచిత స్థానం కల్పిస్తామంటూ వల విసురుతోంది. వచ్చే నెలలో జగన్‌ నియోజక వర్గంలో చేపట్టే పాదయాత్రలో తిరిగి వీరందరికి పార్టీ కండువాలు కప్పే లక్ష్యంతో పావులు కదువుతోంది. అయితే వైసీపీ వ్యూహన్ని పసి గట్టిన టీడీపీ అప్రమత్తమైంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. పార్టీలో మీకు ఎప్పుడు సముచిత స్ధానమేనంటూ భరోసా ఇస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో వలస వచ్చిన నాయకుల్లో ఎవరెవరూ వెళ్లతారన్నది రాజకీయంగా హాట్‌ టాఫిక్‌ అయింది. జిల్లాలో నరసాపురం నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీ కంటే కులాల పోరే ఎక్కువుగా ఉంటుంది. మొత్తం ఓటర్లలో సగ భాగం రెండు సామాజిక వర్గాలదే. ఇక మిగిలిన కూలలు గెలుపు ఓటమిని నిర్ణయిస్తాయి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్నది. అయితే మాజీ ఎమ్మెల్యే ముదునూరి రాకతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆయనకు కుల ఓట్‌ బ్యాంకు లేకపోయినప్పుటికి కొన్ని సామాజిక వర్గాల్లో మంచి పట్టు పెంచుకోగలిగారు. ఫలితంగా 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ ఆభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికలో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌కు గట్టి పోటి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేవలం 3200 ఓట్లు తేడాతో కాంగ్రెస్‌ గెలుపొందింది.

అయితే గత ఎన్నికలతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపో యింది. చివరి నిమిషంలో వైసీపీలో వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడుకి నరసాపురం టిక్కెట్‌ ఇచ్చారు. అప్పటి వరకు ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న ముదునూరిని ఆచంట పంపారు. దీంతో ఆయన వర్గీయులు చాలామంది పార్టీ మీద కినుక వహించారు. కొందరు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండటంగా మారి కొందరు తెలుగుదేశంలో చేరారు. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలసొచ్చాయి. భారీ మోజార్టీతో విజయం సాధించేలా చేశాయి.

రెండేళ్ల క్రితం కొత్తపల్లి టీడీపీలోకి చేరడంతో మళ్లీ నరసాపురానికి వైసీసీ ఇన్‌చార్జ్‌గా ముదనూరిని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో ముదునూరి వర్గీయులు మళ్లీ పాత గూటికి చేరతారని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం, అభివృద్ధికి పెద్ద పీట వేయడంతో పార్టీలో ఉన్నా కొత్తపల్లి వర్గంతో కలవకపోవడం వంటి పరిణామాలతో పగడిచిన రెండేళ్ల కాలంలో పార్టీ ఫిరాయింపులు పెద్దగా జరగలేదు.

తాజాగా వైసీపీ వ్యూహం మార్చింది. వచ్చే నెలలో నియోజక వర్గంలో వైసీసీ అధినేత జగన్‌ యాత్రలో పార్టీకి చెందిన మాజీలను తిరిగి సొంత గూటికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు మొదలేట్టింది. కొందరు స్థానిక సంస్ధల ప్రజా పతినిధులు, నాయకులతో తరుచూ మంత నాలు సాగిస్తోంది. దీంతో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే ఈ వ్యూహానికి టీడీపీ చెక్‌ పెడుతూ వస్తోంది. వైసీసీ నేతలు మంతనాలు జరిపిన నాయకులతో టీడీపీ నేతలు వెంటనే సమావేశ మవుతున్నారు. వైసీసీ అధికారంలోకి రావడం కల అంటూ విస్తృత ప్రచారంతో పాటు అభివృద్ధిలో కలసి పనిచేద్దా, పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మీకు ఎప్పుడు సముచిత స్ధానం ఉంటుందంటూ భరోసా ఇస్తోంది.

Related Posts