YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంజయ్ ఫ్యూచర్ కోసమేనా

సంజయ్ ఫ్యూచర్ కోసమేనా

నిజామాబాద్, డిసెంబర్ 21,
ధర్మపురి శ్రీనివాస్‌. ఇలా పూర్తి పేరుగా కంటే.. DS అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్‌. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీతో ప్రయాణించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మనసు మార్చుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభకు వెళ్లారు శ్రీనివాస్‌. ఎంత వేగంగా గులాబీ కండువా కప్పుకొన్నారో.. అంతే వేగంగా టీఆర్‌ఎస్‌లో తామరాకుపై నీటి బిందువయ్యారు. ఎంపీగా పదవీకాలం దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు . ఢిల్లీలో నేరుగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యి.. పాత పార్టీలోకి వచ్చేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. డీఎస్‌ చేరికపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరి స్పందన ఎలా ఉన్నా.. ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకొస్తున్నారన్నది జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.తన ఇద్దరు కుమారులను రాజకీయంగా సెటిల్‌ చేసేందుకు.. కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్నప్పుడే ధర్మపురి ప్రయత్నించారు. కానీ.. అవేమీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఇంతలో ఒక కుమారుడు బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. పెద్ద కుమారుడు సంజయ్‌ మేయర్‌గా పనిచేసినా.. ఇంకా నిలదొక్కుకోలేదు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు 4 నెలల క్రితం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిశారు సంజయ్‌. ఇంకా ఫైనల్‌ కాలేదు. సంజయ్‌ మాత్రం వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట. పెద్ద కుమారుడు చేస్తున్న పనుల వెనక డీఎస్‌ ఆశీసులు ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాల అనుమానం.తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం వెనక.. సంజయ్‌ను పొలిటికల్‌గా పికప్‌ చేయడమేనన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. జిల్లాలో మళ్లీ కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌తో విభేదాలు తర్వాత సైలెంట్‌గా ఉన్న డీఎస్.. తన వ్యూహాలను జిల్లా రాజకీయాల్లో అమలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ కేడర్‌తో టచ్‌లోనే ఉన్నారట. పట్టుకోల్పోకుండా అందరితో మాట్లాడుతున్నట్టు సమాచారం. సంజయ్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆయన బలమైన కోరికగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా డీఎస్  ఎంట్రీపై మరో చర్చా ఉంది.కాంగ్రెస్‌ పార్టీని వీడాక మానసికంగా ఇబ్బంది పడినట్టు సన్నిహితులకు చెప్పి వాపోయారట . మొదటి నుంచీ ఉన్న పార్టీ కావడంతో.. కాంగ్రెస్‌పై ఆ మామకారం చావలేదని.. తాను కన్నుమూసిన నాడు.. కాంగ్రెస్‌ కండువా తన మీద ఉండాలని చెప్పేవారట. ఆ అభిమానమే ఇప్పుడు ఘర్‌వాపసీకి కారణమని కొందరి వాదన. అయితే ఒక కుమారుడు బీజేపీ ఎంపీగా ఉన్న టైమ్‌లో తండ్రి కాంగ్రెస్‌లో కొనసాగుతానంటే జిల్లా కేడర్‌ ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్న. తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌కు అవసరమైన టైమ్‌లో డీఎస్ వెళ్లిపోయారనే ప్రచారం పార్టీలో ఉంది. ఈ రెండు విషయాలను రీఎంట్రీలో ఎలా ఓవర్‌ కమ్‌ చేస్తారన్నది చర్చ. వీటన్నింటి మధ్య కాంగ్రెస్‌లోకి థర్మపురి రాక… జిల్లా రాజకీయాలను మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.

Related Posts