హైదరాబాద్, డిసెంబర్ 22,
ఢిల్లీలో పొలిటికల్ బ్లేమ్ గేమ్, అడిగి అవమానాల పాలయ్యారా.? రాజకీయ అక్కసు ఎవరిది? దేశ రాజధానిలో పొలిటికల్ సాగు తెలంగాణలో భారీ బియ్యం స్కాం జరిగిందని దీనిపై త్వరలోనే చర్యలుంటాయని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ నేతలను పిలిచి మరీ అమిత్ షా గుడ్ న్యూస్ చెప్పారు., తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కయి..పెద్ద ఎత్తున బియ్యం సేకరణలో స్కాంకు పాల్పడ్డారని.. త్వరలో దీనికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తాయి.. కేసీఆర్ పై పోరాటంలో ఎవరూ వెనక్కి తగ్గవద్దని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారు. ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ నేతలు.. బీజేపీని కార్నర్ చేసి రాజకీయం చేస్తూండటం.. అదే పనిగా ఢిల్లీకి వచ్చి అపాయింట్‌మెంట్‌లు ఇవ్వకుండా అవమానిస్తున్నారని ప్రకటనలు చేస్తూండటం వంటి అంశాలపై చర్చించేందుకు టీఎస్ బీజేపీ ముఖ్య నేతల్ని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. బండి సంజయ్, ఈటల , విజయశాంతి సహా ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లారు. కిషన్ రెడ్డితో సహా అమిత్ షాతో భేటీ అయ్యారు. కేసీఆర్ అవినీతిపై పోరాటం చేయాలని… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని షా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పై పోరాటానికి మీరు చేయగలిగినదంతా చేయండి..ప్రభుత్వ పరంగా ఏంచేయాలో తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై పోరాడాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో తమనే రైతుల దృష్టిలో దోషిగా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించడానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగాతెలుస్తోంది. మొత్తంగా చూస్తే త్వరలో.. తెలంగాణలో భారీ స్కాం తరహా రాజకీయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.