YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ సైకిల్ సవారీ

మళ్లీ సైకిల్ సవారీ

అనంతపురం, డిసెంబర్ 22,
ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే కొంత మంది భయంతోనో.. భక్తితోనే బీజేపీలో చేరిపోయారు. ఇలాంటి వారు రాయలసీమలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వారంతా మళ్లీ టీడీపీలోకి వచ్చి తమ సీటులో కర్చీఫ్ వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కష్టాలు ఎదురైనా టీడీపీలోనే ఉన్న నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కానీ చంద్రబాబు ఆసక్తి చూపించడం లేదు. కొంత మంది అనంతపురం టీడీపీ నేతలు మాత్రం ఆయనను తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. సూరి వెళ్లిపోయిన తర్వాత ధర్మవరం ఇంచార్జ్ గా పరిటాల శ్రీరాంను చంద్రబాబు నియమించారు. కష్టకాలంలో తానే పార్టీ కోసం అక్కడ పని చేశానని.. తాను పోటీ చేస్తానని.. సూరి పార్టీలోకి వచ్చి కష్టపడి పనిచేస్తే పదవుల గురించి ఆలోచిస్తామంటున్నారు. తనను కాదని చంద్రబాబు సూరిని పార్టీలో చేర్చుకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని అంటున్నారు. మరో వైపు సూరి వర్గీయులు మాత్రం సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరతామని బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు. ఒక్క సూరినే కాదు బీజేపీలో చేరిన చాలా మంది టీడీపీ నేతలు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. రాజకీయ పరిస్థితి మారిపోవడం.. ఇప్పుడు చేరకపోతే ముందు ముందు చేర్చుకోరన్న భయంతో ఇప్పుడే కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ సహా పలువురు అదే బాటలో ఉన్నారు. అయితే పాత అనుభవాల దృష్ట్యా పార్టీ కోసం పనికి వచ్చే వారిని మాత్రమే చంద్రబాబు చేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇంత వరకూ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది

Related Posts