YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధియేటర్లపై తనిఖీలు..15 ధియేటర్లు సీజ్

ధియేటర్లపై తనిఖీలు..15 ధియేటర్లు సీజ్

విజయవాడ, డిసెంబర్ 22,
ఏపీలో థియేటర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. కృష్ణాజిల్లా, విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తోన్న థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. బుధవారం కృష్ణా జిల్లా విజయవాడలో జేసీ మాధవీలత ఆధ్వర్యంలో థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. నగరంలోని గాంధీనగర్ లో జయరాం థియేటర్‌కు వచ్చిన ఆమె సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలోని ఫైర్‌ సేఫ్టీ సదుపాయాలను తనిఖీ చేశారు. కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలపై ఆరా తీశారు.. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 15 థియేటర్లు సీజ్ చేశామన్నారు. లైసెన్సు లేకుండా నడుస్తున్న 15 థియేటర్లు మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు జేసీ పేర్కొన్నారుజిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో తనిఖీలు చేస్తున్నాం. టికెట్‌ ధరలు, ఫైర్ సేఫ్టీ ,కోవిడ్ ప్రొటోకాల్స్‌ విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రేక్షకుల భద్రత కోసం నిబంధనలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాం. కొన్ని థియేటర్లలో టికెట్‌ రేట్ల కంటే తినుబండారాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే మల్టీఫ్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్‌డ్‌ రేట్లు నిర్ణయించి బోర్డులు పెడతాం. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్లు అమలుపై దృష్టి పెట్టాం. టికెట్‌ రేట్ల పెంపు కోసం మాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి’ అని మాధవీలత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలపై కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది. అయితే జాయింట్ కలెక్టర్ల అనుమతితోనే టికెట్‌ రేట్లను పెంచుకోవచ్చనే నిబంధనను పెట్టింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

Related Posts