విశాఖపట్నం
విశాఖ లో ఈ అర్ద రాత్రి బారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీ వో ఆఫీస్ వెనుక వున్న అభయ ఆంజనేయ కార్ కేర్ వర్క్ షాపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 7 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.అర్ద రాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం అంచనా. ప్రమాద విషయం తెలిసిన వెంటనే నైట్ రౌండ్స్ లో వున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్ని మాపక సిబ్బంది, విద్యుత్ శాఖ తదితర విబాగాల వారి తక్షణ చర్యలు తో మంటలు అదుపు లోకి తెచ్చారు. అర్ద రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులు లో తీవ్ర ఆందోళన కు గురి చేసింది. ప్రమాద వసాత్తూ జరిగిందా? ఎవరైనా ఉద్దేశ్య పూర్వకంగా చేశారా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.