అమరావతి
రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ యాజమాన్యం, కార్మికులు అందోళనకు దిగడంతో థియోటర్లు మూటపడ్డాయి. ప్రభుత్వం థియేటర్లో టిక్కెట్ల రేట్లు తాము చెప్పిన ప్రకారం అమ్మాలని జి.ఓ జారీచేసింది. ఈ రేట్లు తమకు గిట్టుబాటు కాక అప్పులపాలు ఇవ్వాల్సి వస్తుందని ధియేటర్ యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . నగరపంచాయితీ పరిధిలో ఫస్ట్ క్లాసు 35/- సెకండ్ క్లాస్ 25 /-ధర్డ్ క్లాస్ 15 రూపాయలు పంచాయతీ పరిధిలో ఐదు పది పదిహేను రూపాయలు అమ్మితే థియేటర్లు అద్దె లు, జీతాలు, కరెంటు బిల్లులు కట్టడానికి ఎదురు డబ్బులు కట్టవలసి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి తోడు అధికారుల వరుసదాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అంతా ఏకమై థియేటర్లో నడపలేమని గురువారం నుంచి హాళ్లు మూసివేశారు.