హైదరాబాద్
మాదాపూర్లో భారీ ఎత్తునడ్రగ్స్చ ముగ్గురు ముఠా సభ్యుల గుట్టు రట్టైంది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. మాదక ద్రవ్యాల విక్రయాలపై మాదాపూర్ ఎస్వీటీ పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు విచారణ ప్రారంభించారు. ముగ్గురు నిందితులు మహమ్మద్ అష్రాఫ్ బేగ్, రామేశ్వర శ్రవణ్ కుమార్, చరణ్ తేజలను అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఆష్రాఫ్ టోలి చౌకీలో అరబిక్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఈ ముఠాలో సబ్ ఆర్గనైజర్ గా వున్నాడు. నైజిరీయాకు చెందిన ప్రధాన నిందితుడు జూడ్ పరారీలో ఉన్నాడని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీపీ ‘‘నైజీరియాకు చెందిన జూడ్ అనే వ్యక్తి ద్వారా ముఠా సభ్యులు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గోవా నుంచి భారీగా డ్రగ్స్ను తెప్పించి ముఠా సభ్యులు హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. ఈ కేసులో . 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసి ట్యాబ్లెట్లు ఇరవై ఆరు లక్షల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నాం. రాయదుర్గం పోలీసులు స్టేషన్ లో ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశామని అన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. 2021లో సైబరాబాద్ పరిధిలో 202 కేసులు నమోదు కాగా.. 419 మందిని అరెస్ట్ చేశాం. రిపీటెడ్గా డ్రగ్స్తో పట్టుబడుతున్న 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు.