కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగిసింది. తెర చాటు ఒప్పందాలకు రంగం సిద్దం అయింది. ఎవరికి వారు ఓటరును ఆకట్టుకునేందుకు లోపాయికర ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో జేడీఎస్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ నేత్రుత్వంలో ఈ పార్టీ ఎన్నికల్లో ఎన్ని సీట్టు సాధిస్తుందనే విషయంపై రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేల విషయం పక్కన పెడితే కర్నాటక ఎన్నికల ప్రచారం కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్టు ఉన్నారు.
వీరు హోరెత్తించిన విధానం చూస్తే ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాదు అని కొంత మంది నిర్ధారణకు వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇదే ఊహించి మొదటి నుంచి జేడీఎస్‌తో స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చారు. ప్రధాని మోదీ అయితే దేవెగౌడని ఏకంగా ఆకాశానికెత్తారు. ఇలా అన్నీ బేరీజు వేసుకుంటే హంగ్ వస్తే జేడీఎస్ కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. హంగ్ పరిస్థితి ఏర్పడితే జేడీఎస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది.