కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర నిరాయుధీకరణ చర్చలకుగాను జూన్ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్‌ఉన్‌తో సమావేశం కానున్నారు. ఉత్తర కొరియా నుంచి నిరంధిత ముగ్గురు అమెరికన్లను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపీయో స్వదేశానికి తీసుకొచ్చిన కొన్ని గంటలకే కిమ్‌తో ట్రంప్ చారిత్రక సమావేశం ప్రకటన వెలువడింది. ఉత్తర కొరియా నుంచి విడుదలైన ముగ్గురు అమెరికన్లకు ట్రంప్ స్వయంగా ఆండ్య్రూ వాయుసేన విమాన స్థావరంలో స్వాగతం పలికారు. ‘అనేక మంచి విషయాలు జరిగాయి. మేము కొత్తగా చర్చలు ఆరంభించనున్నాం. చెప్పుకోదగ్గవి జరిగేందుకు మంచి అవకాశాలున్నాయ’ని ట్రంప్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినందుకు ముగ్గురు అమెరికన్లను నిర్బంధించి లేబర్ క్యాం పులో ఉంచారు. అయితే వారిని ఉత్తరకొరియా ఇప్పుడు విడుదల చేసింది. ఈ చర్యకు కిమ్‌ను ట్రంప్ ప్రశంసించారు. సమావేశానికి కిమ్ జోంగ్‌ఉన్ ఇచ్చిన ఆహ్వానాన్ని మార్చిలోనే అమెరికా అంగీకరించారు. నాటి నుంచే వారిద్దరి చారిత్రక సమావేశానికి ఏర్పాట్లు కొనసాగుతున్నా యి. అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా నాయకుడి మధ్య జరగబోయే తొలి సమావేశం ఇదే కానున్నది. వీరిద్దరి మధ్య సమావేశాన్ని కొరియా సైనికీకరణ మండలం లేదా మంగోలియాలో నిర్వహించాలని కూడా అమెరికా అధికారులు పరిశీలించారు. కానీ చివరికి సింగపూర్‌లో ఖా యం చేశారు. కొరియా ఆయుధ కార్యక్రమం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను తారస్థాయి కి తీసుకెళ్లింది. దాంతో ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించాలని అమెరికా భావించింది. సింగపూర్ ఇదివరలో కూడా ఉన్నత స్థాయి నేతల సమావేశాలకు నెలవైంది. 2015లో చైనా, తైవాన్ నాయకులు కూడా 60 ఏళ్ల తర్వాత ఇక్కడ చారిత్రక సమావేశాన్ని నిర్వహించారు. సింగపూర్, అమెరికాల మధ్యసన్నిహిత సంబంధాలున్నాయి. ఉత్తరకొరియాతో సింగపూర్‌కు దౌత్యసంబంధాలుండేవి. కానీ గత ఏడాది అమెరికా నేతృత్వంలో ఆంక్షలు విధించాక తెంచేసుకుంది