YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మహిళా సహకార సంస్థ చైర్మన్ గా ఆకుల లలిత

మహిళా సహకార సంస్థ చైర్మన్ గా ఆకుల లలిత

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఆకుల లలిత రాఘవేందర్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  ఉమెన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు  కృతజ్ఞతలు అని తెలిపారు. నాకు చాలా పెద్ద బాధ్యతను అప్పగించారు.  మహిళా సాధికారత కొరకు  వారి అభ్యున్నతి కొరకు సాటి మహిళ గా నేను చాలా కృషి చేయవలసి ఉందని దీని కోసం అహర్నిశలు కృషి చేస్తాననిఅన్నారు.  ఇప్పుడు దీనికి సంబంధించి పది జిల్లాల్లోనూ అమలు  అవుతున్నందున రాబోయే రోజులలో దీనిని 33 జిల్లాల మహిళా అభ్యున్నతి కోసం విస్తరించి  తప్పకుండా దీనిని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని తెలిపారు.  ఈ సందర్భంగా  కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆకుల లలిత  రాజకీయాలలో చాలా అనుభవం ఉన్నవారు  అని చాలా పదవులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేశారని  ముఖ్యమంత్రి  ఆశీర్వాదంతో ఈ పదవి చేపట్టేందుకు ఆకుల లత కి శుభాభినందనలు అని తెలిపారు.  ఇప్పుడు చేపట్టిన పదవి చాలా బాధ్యతగల పదవి అని  దీని మహిళా సాధికారతకు అభ్యున్నతి  కొరకు తప్పకుండా కృషి చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల చాలా ముందు చూపు ఉంది అని మహిళల సంక్షేమం సంక్షేమం కొరకు కృషి  చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నారు.   మహిళల భద్రత పట్ల రక్షణ పట్ల వారి భవిష్యత్తు కొరకు చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి  ఆలోచిస్తారు అని దానికి నిదర్శనమే రాష్ట్రంలో మహిళల కొరకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్  మరియు వారి సంక్షేమం కోసం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి  ఆలోచనల్లో ముఖ్యంగా ఉంది అని తెలిపారు మహిళల విషయాల్లో చాలా ముందుచూపుతో  ఆలోచిస్తారు  అని తెలిపారు. 

Related Posts