తిరుపతి
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక కార్యచరణ చేపట్టి ఎలాంటి ఘటనలకు తావు లేకుండా భక్తులు, యాత్రికుల భద్రతపై దృష్టి సారించి వారి సౌకర్యార్థం 24x7 పోలీస్ డయల్ 100 సేవలు అందుబాటులోకి వచ్చింది.తిరుమల లోని వసతి సముదాయాలు, విశ్రాంతి భవనాలు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడలీలు, పార్కింగ్ ప్రదేశాల వద్ద సుమారు 50 డయల్ 100 బోర్డు లను జిల్లా పోలీసులు ఏర్పాటు చేసారు. ప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం స్పైడర్ బ్లూ కోల్ట్ లను ఏర్పాటు చేసి డయల్ 100 కాల్స్ కు తక్షణమే స్పందిచే విధంగా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్పైడర్ బ్లూ కోల్ట్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తిరుమలలో కూడా ఇలాంటి సేవలను ప్రజలు, భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో డయల్ 100 సేవలను తిరుమలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా భద్రతా పరమైన ఇబ్బందులు కలిగిన యెడల డయల్ 100 కు తెలియపరిచి సహాయం పొందవచ్చు. మీరున్న ప్రదేశంలో అనుమానిత వ్యక్తులు గానీ, అనుమానించదగ్గ వస్తులువు గానీ ఉన్నచో వెంటనే దయల్ 100కు సమాచారం అందించి పోలీస్ లకు సహకరించాలని జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తిరుమల అడిషనల్ యస్.పి మునిరామయ్య. డి.యస్.పి లు యస్.బి చంద్రశేఖర్, తిరుమల ప్రభాకర్ రావు, సి.ఐ లు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.