YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో మూవీ

చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో మూవీ

మంచి కథ దొరికితే ఏ దర్శకుడితోనైనా సినిమా చేయడానికి తాను సిద్ధమేనని ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి చెప్పాడు. యంగ్ డైరెక్టర్లకు కూడా ఇది మంచి ఆఫరే. తమిళనాట  రజనీకాంత్ ఇదే చేస్తున్నాడు. ఓవైపు శంకర్ లాంటి సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తూ మరోవైపు రంజిత్, కార్తిక్ సుబ్బరాజ్‌లాంటి యంగ్ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకుడు సురేందర్ రెడ్డితో ‘సైరా..’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ సినిమాకు కమిటయ్యాడు. ఇక తాజాగా చిరును దర్శకుడు కొరటాల శివ కలవడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సామాజిక కథలకు కమర్షియల్ హంగులద్ది సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల అందెవేసిన చేయి. ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాల్లోనూ ఆయన ఇదే చేశాడు.  ఈ నాలుగు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇక ఇప్పుడు ఆయన అఖిల్ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసింది. ఈ గ్యాప్‌లోనే చిరంజీవిని కలిశాడు కొరటాల శివ. తన దగ్గర ఉన్న ఓ మంచి కథను ఆయనకు చెప్పాడని తెలిసింది. కొరటాల టేరటాల గురించి ఇప్పటికే ఓ ఐడియా ఉన్న చిరు  సినిమా చేద్దామనే మాట ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే ‘ఠాగూర్’ రేంజ్‌లో కమర్షియల్  ప్లస్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వస్తుందేమా చూడాలి.

Related Posts