YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయినా...బాబు మార లేదు...

అయినా...బాబు మార లేదు...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే తప్పు చేస్తున్నారా? ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన విధంగానే పరిపాలన చేస్తున్నారా? అవును. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చంద్రబాబులో మార్పు రాలేదంటున్నారు. అది పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందేనంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అధికారులతో పనిచేయిస్తూనే, ప్రజాప్రతినిధులకు ఎక్కువ సమయం కేటాయించేవారు. వారు చెప్పేది ఓపిగ్గా వినేవారు. వైఎస్ బిజీగా ఉంటే ఆయన ఆత్మగా భావించే కేవీపీ వద్దకు సులువుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వెళ్లి తమ సమస్యను చెప్పి పరిష్కరించుకునే వారు. కాని చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వరు.పార్టీ సమావేశంలోనూ తమ అభిప్రాయాలు చెప్పాలంటే కుదరని పని. కనీసం మంత్రి లోకేష్ కు చెప్పుకుందామన్నా వీలుకావడం లేదన్నది టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన. ఇలా అధికారుల మాట విని అంతా బాగుందని చప్పట్లు కొట్టుకుంటే మునిగిపోవడం ఖాయమంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. మరి చంద్రబాబు అదే ఒరవడిని కొనసాగించాలని చంద్రబాబు కలెక్టర్లకు ఉద్భోదించారు. అధికారుల్లో ఉత్సాహం తెచ్చేదానికి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కాని ఆయన మళ్లీ అధికారులు చెప్పేలెక్కలపైనే ఆధారపడి శూన్యంలో మేడలు నిర్మిస్తున్నారంటున్నారు టీడీపీ నేతలు.కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో గృహనిర్మాణంపై లబ్దిదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారి, ఐఏఎస్ బాబు సమావేశంలో చెప్పారు. అయితే దీనికి వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించలేదని, ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా ప్రజలు ఎలా సంతృప్తి చెందుతారని అచ్చెన్నాయుడు సమావేశంలోనే ప్రశ్నించడం కొంత చర్చకు దారితీసింది. ఇలా అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నది మంత్రులు, సీనియర్ నేతల భావన.చంద్రబాబు ముఖ్యమంత్రిగాకాకుండా గతంలోనూ ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్నారు. అధికారుల చేత పనులు చేయించడంలో చంద్రబాబుకు మించిన వారు లేరంటారు. కాని అదే సమయంలో అధికారులు చెప్పే లెక్కలపైనే ఆయన ఆధారపడతారన్నది వాస్తవం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అధికారులకంటే ప్రజాప్రతినిధులకే ఎక్కువగా తెలుస్తుంది. గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువగా ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో ఆశ్రయిస్తారు. తమ సమస్యలను చెప్పుకుంటారు. అయితే ప్రజాప్రతినిధులు వాస్తవాలు చెబితే చంద్రబాబు ఒప్పుకోరని, కంప్యూటర్లో లెక్కలు చూపించి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts