YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోలీసుల దిగ్బంధంలో రేవంత్ ఇల్లు

పోలీసుల దిగ్బంధంలో రేవంత్ ఇల్లు

హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి పంటను మీడియాకు చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా ఇవాళ రైతులతో సందడి చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన రేవంత్ ఇంటి వద్ద అర్ధరాత్రి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు అల్లర్ల నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు :
సోమవారం ఉదయం పోలీసులు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఈ రోజు గజ్వెల్ నియోజక వర్గం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లి లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ జరగనుంది. ఈ రచ్చబండ లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియా కు చూపిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎర్రవెళ్లిలో రచ్చబండ కార్యక్రమం ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి.ముందు పోలీసుల పహారా కాసారు.రేవంత్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, సంపత్ కుమార్ ఇళ్ల వద్ద కూడా పోలీసులను మోహరించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

Related Posts