అమరావతి
రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మరోసారి వాయిదా పడింది. జనవరి 28కి హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆ రోజు నుంచి పూర్తిస్థాయి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. రైతుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్.. పిటిషన్లపై విచారణ కొనసాగాలని కోర్టును కోరారు. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్లు దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. రైతుల తరఫు న్యాయవాదుల నోట్లు సమర్పించిన అనంతరం ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది