అమరావతి
ఆరు నూరైనా, ఎవ్వరు అడ్డు వచ్చినా మళ్ళీ సీఎం చంద్రబాబు అవుతారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు అన్నారు. విభజన హామీ ప్రకారం విద్యుత్ పరంగా 6500 కోట్లు తెలంగాణ నుంచి రావాలి. ఒక అవకాశం అని చెప్పిన ఈ వైసిపి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్న స్థితి రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సమర్ధవంతమైన నాయకులు వస్తే గాని రాష్ట్రం లో పరిస్థితి చక్కపడదు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత చంద్రబాబు ది. 2014 సీఎం చంద్రబాబు ఉన్న సమయంలో..22.5 ట్రిలిన్ యూనిట్లు విద్యుత్ లోటు ఉండేది. 36 వేల కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టి 10 వేల మెగావాట్లు విద్యుత్ తెచ్చారు. ప్రస్తుత సీఎం పరిపాలన చేతగాని వ్యక్తి. రాయలసీమ థర్మల్ ప్లాంట్ మూసివేయడానికి ఈ ప్రభుత్వం అడిగింది. అప్పటికి ఇప్పటికి విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. చంద్రబాబు హయాంలో ఇంటికి , వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇచ్చాం. డిస్కమ్ లు ఇండివిడ్యుల్ చేశారు. వ్యవస్థలను నాశనం చేశారు. కార్మికులను రేగులరైజ్ చేసిన ఘనత టిడిపి హయాంలో జరిగింది. కార్మికులు మాతోనే ఉన్నాము అనుకున్నాము.. మేము ఏం అడిగినా ఇచ్చాం..కానీ పాదయాత్ర లో జగన్ పెట్టిన దండాలకు మోసం పోయారని అన్నారు.