YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘవీరా రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్

రఘవీరా రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్

అనంతపురం, డిసెంబర్ 28,
మౌన ముని మౌనం వీడారా?.. ఆయన యాక్టీవ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారా? అంటే.. ఆ సీనియర్ లీడర్ వద్ద నుంచి సమాధానం లేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఒక్కో రోజు ఒక్కో పార్టీలోకి వెళ్తున్నారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని కొందరు.. లేదు బీజేపీలోకి వెళ్తున్నారని మరికొందరు.. కాదు కాదు వైసీపీలోకి వెళ్తున్నారని ఇంకొందరు. చివరకు పార్టీ మారుతున్నది ఆయన కాదు.. ఆయన కూతురు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇంతకీ అంత హాట్ టాపిక్ గా మారిన ఆ సీనియర్ లీడర్ ఎవరు?.. ఏంటా ప్రచారం కథ? ఇప్పుడు తెలుసుకుందాం..రఘువీరారెడ్డి.. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు మంత్రిగా.. సుదీర్ఘకాలం పాటు పీసీసీ అధ్యక్షుడిగా.. అంతెందుకు సీఎం రేస్ వరకు వెళ్లిన నాయకుడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయన రాష్ట్ర విభజన తరువాత కూడా ఆ పార్టీని వీడలేదు. చివరకు 2019 ఎన్నికల వరకు పార్టీ గెలుపు కోసం పని చేశారు. కానీ ఏం చేస్తాం.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పట్లో లేచేలా లేదు. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయ వైరాగ్యంతో పీసీసీ పదవికి రాజీనామా చేసి ఆయన స్వగ్రామం మడకశిర మండలం నీలకంఠాపురం వెళ్లిపోయారు. అక్కడ శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునర్నిమాణం చేపట్టారు. రెండేళ్ల పాటు ఆ కార్యక్రమంలో ఉండి.. జిల్లాలో ఒక అద్భుత దేవాలయం నిర్మాణం చేపట్టే వరకు నిద్రపోలేదు. ఆయన రెండేళ్ల నుంచి రాజకీయాల జోలికి వెళ్లలేదు. అంతెందుకు కనీసం ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడింది లేదు. కానీ అప్పుడప్పుడు పొలం పనులు చేసే రైతుగా.. గ్రామంలో కూలీలతో కలసి వ్యవసాయ కూలీగా కనిపించారు. గ్రామంలో పిల్లలతో ఆటలు, పెద్దలతో ముచ్చట్లతో.. టీవీఎస్ మోపెడ్ పై పచ్చటి పొలాల మధ్య చక్కర్లు కొడుతూ కనిపించారు.అయితే ఆలయ నిర్మాణ పనులు పూర్తైనా.. ఇంకా ఎందుకు రఘువీరా మౌనం వీడలేదు అంటే ఎవరి వద్ద సమాధానం లేదు. కానీ గత రెండు వారాలుగా ఆయన యాక్టీవ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని.. ముహుర్తం కూడా ఖరారైందని ప్రచారం మొదలు పెట్టారు. మరికొందరు బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఆయన చుట్టూ ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం నో కామెంట్ అంటున్నారు. ఈ ప్రచారం పీక్స్ కి వెళ్లి.. పార్టీ మారుతున్నది రఘువీరారెడ్డి కాదని.. ఆయన కూతురు అమృత అని చెబుతున్నారు. ఎప్పుడో 2009ఎన్నికల సమయంలో రఘువీరా తరుఫున ఎన్నికల ప్రచారంలో కనిపించిన ఆమె ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నారని.. వెనుక నుంచి రఘువీరారెడ్డే కథ నడిపిస్తారని ప్రచారం సాగుతోంది.వాస్తవంగా ఈ ప్రచారంలో నిజమెంత అంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయనకు అలాంటి ఆలోచనలే లేవని అంటున్నారు. ఎక్కడో ఫారిన్ లో ఉన్న ఆయన కూతురు ఇక్కడ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పడం ఏంటని అంటున్నారు. మరి ఈ రూమర్స్ కి చెక్ పడాలంటే చెప్పాల్సిన మనిషి.. చెప్పాల్సిన సంగతి చెప్పాలి. అదేనండి రఘువీరుడు మౌనం వీడేంత వరకు ఈ ప్రచారం ఆగదన్నమాట. మరి చూడాలి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో.

Related Posts