YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మమ అనిపిస్తున్న భేటీలు

మమ అనిపిస్తున్న భేటీలు

విజయవాడ, డిసెంబర్ 28,
ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్‌మెంట్‌పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహించారు అధికారులు. 13 సంఘాలకు ఆహ్వానాలు వెళ్లడంతో వారంతా సూచించిన టైమ్‌కు చెప్పిన లొకేషన్‌ బ్లాక్‌ నెంబర్‌ 2 దగ్గరకు వచ్చేశారు. సీఎస్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలో ఆర్ధికశాఖ కార్యదర్శులతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగాల్సి ఉంది. ఉద్యోగ సంఘ నాయకులు కమిటి హాల్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఐదు కావటానికి పావుగంట ముందే సీఎస్‌ సచివాలయం నుంచి తాడేపల్లిలోని సీఎమ్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో అంతా కంగుతిన్నారు.సీఎస్‌ లేకపోయినా ముగ్గురు ఆర్ధికశాఖ కార్యదర్శులు మీటింగ్‌ హాలులో ఉండటంతో ఉద్యోగ సంఘాల నేతలు సర్ది చెప్పుకొన్నారట. ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది. హెచ్‌ఆర్‌ ఫైనాన్స్‌ కార్యదర్శి శశిభూషణ్‌ సమావేశానికి వచ్చిన నేతల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మిగిలిన ఇద్దరు కార్యదర్శులు రావత్‌, సత్యనారాయణలు తమతో తెచ్చుకున్న ల్యాప్‌ టాపుల్లో మునిగిపోయి.. తమ సమయం వృథా కాకుండా చూసుకున్నారట. దీంతో సీఎస్‌ వచ్చేంత వరకు మాటలు కలుపుతా.. అసలు విషయం పెద్దాయనతోనే మాట్లాడుకోవాలని చెప్పారట శశిభూషణ్‌. సీఎస్‌ రావటం లేటవుతుందేమో.. షుగర్‌ పేషెంట్స్‌కు ఇబ్బంది లేకుండా మరోదఫా స్నాక్స్‌ తెప్పిస్తాను.. అని సెటైర్లు వేశారట. టిఫిన్లు తిని, చల్లటి ఏసీ రూమ్‌లో వేడి వేడిగా టీ కాఫీలు తాగి.. నాయకులంతా పాత రీల్‌ మళ్లీ రీప్లే చేయడంతో అక్కడున్నవాళ్లకు సౌండ్‌ లేదట.8 గంటలకు సీఎస్‌ సమీర్‌ శర్మ సచివాలయానికి వచ్చారు. అప్పటికే వెయింటింగ్‌లో ఉన్న ఐకాస నేతలు అలిసిపోయి ఉంటారని భావించారో ఏమో.. 14 శాతం ఫిట్‌మెంట్‌తో సరిపెట్టేద్దాం అని సీఎస్‌ చెబితే.. ఉద్యోగ సంఘాల నాయకులు 34కి తగ్గేది లేదని సమాధానం ఇచ్చారు. 14 శాతం ఫిట్‌మెంట్‌ నివేదిక తప్పుల తడకగా కొట్టిపారేశారు ఐకాస నేతలు. ఇలా పావు గంట గడిచాక.. అధికారులు చాణక్యం ప్రదర్శించారు. మా లెక్కలు తప్పంటున్నారు కదా.. మళ్లీ లెక్కలు వెరిఫై చేస్తాం అని బదులివ్వడంతో… మీటింగ్‌లో ఏదో తేలిపోతుందని అనుకున్న ఉద్యోగులకు ఆ సమాధానం మింగుడుపడలేదు. ఇదంతా కాదు సీఎం దగ్గరే తేల్చుకుంటా అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడంతో.. చిరునవ్వులు చిందించారట అధికారులు. అయితే ఓకే.. ఇప్పుడు సీఎం ఉండరు. మళ్లీ వచ్చే వారమే అని మీటింగ్‌కు క్లోజ్‌ చేశారట. ఎంతో ఉత్సాహంతో మీటింగ్‌కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల ఉస్సూరు మంటూ బయటకొచ్చారు. ఏమైంది అని మీడియా ప్రశ్నిస్తే.. ఏముందీ ఈ మీటింగ్‌ కూడా మమ అనిపించారని నిట్టూర్పులిడిచారు. అదండీ.. పీఆర్సీపై మీటింగ్‌లో టీ కాఫీలకు, టిఫిన్లకు ఇస్తున్న ప్రాధాన్యం.. సమస్య పరిష్కారనికి ఇవ్వడం లేదని సచివాలయ వర్గాల్లో ఒక్కటే సణుగుడు.

Related Posts