హైదరాబాద్
చాంద్రాయణగుట్ట ఒవైసి జంక్షన్ లో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేయర్ విజయనలక్ష్మి, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు తదితరులు పాల్గోన్నారు, ఈ ఫ్లైఓవర్ ను 80 కోట్లతో 1.36 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ ను జీహెచ్ ఎంసి నిర్మించింది. మొదటి దశలో 8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలకు జీహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది. 23 చోట్ల అందుబాటులోకి ఫ్లైఓవర్లు అండర్పాస్ లు అందుబాటులోకి రానున్నాయి. 24 చోట్ల పనులు వివిధ దశలలో ఉన్నాయి. మరి కొద్ది రోజులలో షేక్పేట్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కూడా ప్రారంభం కానుంది.