సూర్యా పేట
తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం పాల్గొన్నారు. ఈటల మాట్లాడుతూ జీవో 124/ 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇప్పుడు పరుగులు పెడుతున్నారని అన్నారు. జీవో 317 ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసింది. వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన వారి ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి విషాద వాతావరణం ఉంది. చిక్కుముడులు, అపోహలు,అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా చర్చలు జరిపాలి. అప్పటి అరకు ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కెసిఆర్ నేను రాజును నాకే అన్నీ తెలుసు. నేను చెప్పిందే చేయాలి అని హుకుం జారీ చేస్తున్నారు. 3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. బేషాజాలు ఎందుకు? వీరి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వీరి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నారు ? 124 జీవో స్థానికత కేంద్రబిందువుగా బదిలీలు చేయమని చెప్పింది. కానీ ఇప్పుడు ఇచ్చిన 317 జీవోలో ఆ ఊసే లేదు. ఇప్పుడు ఇచ్చిన సీనియారిటీలో పారదర్శకత లేదు, శాస్త్రీయత లేదు. సీఎం వీరు ఆందోళన పడుతున్నారు వాళ్ళ డిమాండ్స్ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే బాగా పని చేయగలరు అని మీరే చెప్పారు సీఎం గారు. భార్య భర్త ఒక దగ్గర ఉంటేనే బాగు అని చెప్పారు. ఎందుకు గుర్తు లేదు. ఉద్యమంలో చెప్పి సీఎం అయ్యాక మర్చిపోయారా? కిడ్నీ, హార్ట్, న్యూరో పేషెంట్లకు,మెంటలీ డిజార్డర్ పిల్లలు ఉన్న వారికి ప్రియారిటే ఇవ్వాలి. భార్య భర్తలు ఒకే దగ్గర ఉండాల్సిందే. ఒక సారి జిల్లాకు వెళ్లిన తరువాత మళ్లీ మారే వెసులుబాటు ఇవ్వాలి. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధనలో భాగమైన వారి జీవితాల్లో మట్టి కొట్టవద్దని ఈటల అన్నారు.