నూజివీడు
కృష్ణాజిల్లా నూజివీడు ధర్మ అప్పారావు కళాశాలలో ఫీజు కడితేనే విద్యార్థులకు ఎగ్జామ్ కు అనుమతిస్తున్నారు. కాలేజీ ఫీజు కట్టలేదు అంటూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం ఎగ్జామ్ రాయనివ్వలేదు. విద్యార్థులు పూర్తి ఫీజు కడితేనే ఎగ్జామ్ వ్రాయిస్తాం లేదంటే టిసి లు తీసుకోండని అంటున్నారని విద్యార్దులు అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులను ఎగ్జామ్ రాయకుండా బయటకు పంపివేసారు. ఎగ్జామినేషన్ ఫీజు 2వేలు కట్టించుకుని నేడు మొత్తం ఫీజు 10వేలు కడితేనే ఎగ్జామ్ మొత్తం ఫీజు కట్టలేదని ఎగ్జామ్ వ్రాయ నివ్వకుండా బయటకు పంపివేసారు. సోమవారం ఫీజు చెల్లించమని చెప్పినా నేడు ఎగ్జామ్ రాయనివ్వకుండా ఆపివేసారు. ఫైనల్ ఎగ్జామ్స్ లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్కులు కలుస్తాయి తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు అంటున్నారు.