YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దిశా యాప్ టార్గెట్ కోటి డౌన్ లోడ్ లు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్

దిశా యాప్ టార్గెట్ కోటి డౌన్ లోడ్ లు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్

మంగళగిరి
సామన్య వ్యక్తులు కూడ పోలీస్ దగ్గరకు వెళ్ళేందుకు అవకాశం కలిగింది.గతంలో ఇటు వంటి పరిస్థితి లేదు.ఇన్వేస్టీగేషన్ చేసి ఛార్జీషీట దాఖాలు చేయడంలో గత ఐదు సంవత్సరాల కాలంలో 75.09 % మెరుగైందని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బుధవారం అయన రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదికను విడుదల ఏసారు. సిఎడబ్లు 42 % మెరుగైంది.దిశ చట్టం కొచ్చినప్పుడు తక్కువ కాలలో ఇన్వేస్టీగేషన్ జరుగుతుందా అనే అనుమానాలను పటాపంచలు చేసి త్వరతగతిన ఇన్వేస్టీగేషన్ చేసి కేసులు నమోదు చేస్తున్నామనన్నారు.దిశ కోటి డౌన్ లోడ్ లు చేయలన్నరు కాని 97 లక్షల పై చిలుకు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. దిశ యాప్ త్వరగానే రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే అన్నారు. స్పందనలో భాగంగా 163 033 పీటిషన్స్ వస్తే 40,404 ఎఫ్ ఐఆర్ నమోదు చేశామన్నారు. మిగితావి కూడ విచారణజరిపి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
గతంలో లాగ కాక పోలిస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లేంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మైనర్ లు కూడ కంప్లేంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ పరివర్తనలో  భాంగంగా ఏజెన్సీ ఏరియాలో 2,762 ఎకరాల గంజాయి సాగుల్నీ ద్వంసం చేశామన్నారు. ఎక్సైజ్ కేసుల్లో 43,293 కేసుల్లో 60,868 మందిని అరెస్ట్ చేశి 20 ,945 వాహనాలను స్వాధినం చేసుకున్నామని తెలిపారు. టెక్నాలజీ ద్వార నేర పరిశోధన కొత్త పుంతలు తోక్కుతుందని అన్నారు. దాని ద్వార మొబైల్ అప్లికేషన్ సెంట్రల్ లాక్,ఇన్వేస్టీగేషన్ ట్రాక్కర్ జిఐయస్,జిపియస్ విధానం పద్దతులు  డిజిటల్ విధానం అనుసరిస్తున్నామని తెలిపారు

Related Posts