YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

తెలంగాణ-ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జర్జి చేవిచారణ జరిపించాలి

తెలంగాణ-ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జర్జి చేవిచారణ జరిపించాలి

హైదరాబాద్ డిసెంబర్ 28
అడవిలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి నక్సల్స్ కాల్చివేత కు పాల్పడుతున్నారని  సిపిఐ (ఎంఎల్) క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఆరోపించారు.తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ అని,దీని  పై సిట్టింగ్ జర్జి చేవిచారణ జరిపించాలని నేడొక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీస్ బేస్ క్యాంపు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని ఈ పోలీస్ బేస్ క్యాంప్ నిర్మాణాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్నాలు బంధాలు ఆందోళనలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అడవిలో మా గూడెం లో పోలీస్ బేస్ క్యాంప్ నిర్మిస్తే మాకు మానసిక,శారీరకంగా  పోలీసులు వత్తిడి చేయడం మా పై దాడులు చేయడం జరుగుతుందని గూడెం ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. క్యాంపులకు  వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన చేయడం కోసం ఇటీవలనే డీజీపీ మహేందర్రెడ్డి ఈ ప్రాంతంలో తిష్టవేసి ఆందోళన చేస్తున్నా ఆదివాసీలను ప్రజలను ఉద్యమాలకు దూరం చేయవచ్చునని భ్రమలో దళిత దోపిడి దళారుల దోపిడీ పాలకవర్గాలు వీరికి అండగా పోలీస్ వ్యవస్థ ఉందని భీమాతో ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్ పాల్పడుతున్నారని ప్రభాకర్ మండిపడ్డారు. అడవిలో ఉన్న అపారమైన సంపద దోపిడి కోసం మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ సమాధానం కాదన్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ కేంద్రంలోని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ప్రత్యేక చట్టాలు తెచ్చాయని ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ కెసిఆర్ వైఎస్ జగన్ కూడా తుంగలో తొక్కుతున్నారని రాజకీయాలకు వ్యతిరేకంగా జీవించే హక్కు కోసం ప్రజల పక్షాన అన్ని సంస్థలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభాకర్ వెల్లడించారు.

Related Posts