మేడ్చల్
మంత్రి మల్లారెడ్డి పనితీరుపై సొంత పార్టీనేతలే మండిపడుతున్నారు. మంత్రి తీరుకు నిరసనగా తెరాస పార్టీ సభ్యత్వానికి ఉప సర్పంచ్ , 10 మంది వార్డు సభ్యులు రాజీనామా చేసారు. కీసర లో తెరాస నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎన్నికలకు ముందు తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి నేడు తమ గ్రామం పై వివక్షత చూపుతున్నాడని వారు విమర్శిస్తున్నారు.
కీసర మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన సమాచారం ఇవ్వకుండా అవమనపరుస్తున్నారని దొంగల్ దొంగలు ఊర్లు పంచుకున్నట్టు తెరాస పెద్దల తీరు ఉందని ఆగ్రహించిన యదర్పల్లి గ్రామ ఉప సర్పంచ్ మరియు పది మంది వార్డు సభ్యులు తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశామని పేర్కొన్నారు. రానున్న కాలం లో తెరాస మనుగడ లేని పార్టీ అని ఎద్దేవా చేశారు.