YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కాపులు రాజకీయశక్తి...?

ఏపీలో కాపులు రాజకీయశక్తి...?

విజయవాడ, డిసెంబర్ 29,
ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల శెట్టిబలిజ కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణ, మాల మహానాడు నేత ఆర్.ఎస్.రత్నాకర్ అంతర్గత సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని విశ్లేషకులు అంటున్నారు.ఒకవైపు చలి, మరోవైపు ఏపీలో రాజకీయం స్తబ్ధుగా వున్న వేళ ఒక్కసారిగా వేడి రాజుకుంది. కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బీసీ, దళిత సంఘాల నాయకులు కలుసుకున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యమాలకే పరిమితమైన ముద్రగడను ఒక్కసారిగా ఇరు సామాజిక వర్గాల నాయకులు ముద్రగడను ఈయన స్వగృహంలో కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజా చరిష్మా ఉన్న నాయకుడు ముద్రగడను కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.వీరందరి కలయికకు కారణం ఏమై ఉంటుందన్న దానిపై హాట్ టాపిక్ అవుతోంది. ముద్రగడను కలిసేందుకు శెట్టి బలిజ సామాజిక వర్గం నుండి కుడుపూడి సూర్యనారాయణను, దళిత సామాజిక వర్గం నుండి ఆర్.ఎస్ రత్నాకర్ వచ్చారు వీరిరువురిని ఉద్యమ నేత ముద్రగడ ఆప్యాయంగా అక్కున చేర్చుకుని వీరి రాకకు గల కారణాలను తెలుసుకున్నారు. వీరంతా ఓ.సి బి.సి ఎస్.సి కులాలకు చెందిన నాయకులు కావడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఏమైనా పావులు కదుపుతున్నారా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే అపార రాజకీయ మేధావైన ఉద్యమనేత ముద్రగడను అంత తేలిగ్గా ముగ్గులోకి దింపడo వీరిరువురికీ సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ముద్రగడ నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమావేశం అనంతరం నేతలు మీడియా ముందు వెల్లడించారు. ఈ సమావేశంపై ఇతర పార్టీల నేతలు కూడా కూపీలాగినట్టు సమాచారం.

Related Posts